ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ సింగపూర్ కు చెందినదట

ప్రపంచంలో 227 దేశాలు ఉండగా.. సింగపూర్ పాస్‌పోర్ట్ తో 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు
శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో ఇంతకు ముందు జపాన్ నెంబర్ వన్ గా కొనసాగింది. 2023లో ఆ స్థానాన్ని సింగపూర్ ఆక్రమించింది
గ్లోబల్ పాస్ట్ పోర్టు ర్యాకింగ్ ఇంటర్నేషనల్ ఎయిర ట్రాన్స్ పోర్టు అథారిటీ డేటా ప్రకారం ఈ ఏడాది జపాన్ మూడో స్థానానికి పడిపోయింది
రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్టు ఉంటే 190 దేశాల్లో వీసా లేకుండా తిరగొచ్చు
జపాన్ తో పాటు దక్షిణ కొరియా, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, లక్జెంబర్గ్, స్వీడన్ దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ నాలుగో స్థానంలో ఉంది
భారతదేశం ఈ జాబితాలో 80వ స్థానంలో ఉంది. భారత్ పాస్ పోర్టుతో 57 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్‌ ఉంటుంది
సిరియా 101, ఇరాక్ 102, ఆఫ్ఘనిస్తాన్ 103 ర్యాంకులలో ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌లు. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది
10 సంవత్సరాల క్రితం 2014లో UK, US రెండూ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉండేవి. అయితే అప్పటినుండి ఆ దేశాల వీసాలు తిరోగమన పథంలో ఉన్నాయి