ఎవరీ 'భాగ్యశ్రీ బోర్సే'.. మాస్ మహారాజా సినిమాలో హీరోయిన్

మాస్ మహారాజా రవితేజ తన సినిమాలతో ఎంతో మంది హీరోయిన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ ఉంటారు
తాజాగా మరో బ్యూటీ కి తన సినిమాలో అవకాశం ఇచ్చారు రవితేజ.. ఆ అమ్మాయి పేరు 'భాగ్యశ్రీ బోర్సే'.
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది
విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం అవుతోంది
మాస్ మహారాజా రవితేజ సరసన ఆడిపాడనున్న 'క్లాస్ మహారాణి' అంటూ భాగ్యశ్రీని చిత్ర యూనిట్ పరిచయం చేసింది
భాగ్యశ్రీ బోర్సే పూణెకి చెందిన మోడల్. ప్రముఖ డిజైనర్స్ తో కలిసి ఆమె పని చేసింది
ఆమె 'యారియన్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
క్యాడ్బరీ సిల్క్ యాడ్ లో కూడా నటించింది. ఇప్పుడు రవితేజ సరసన టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది
మొదటి సినిమా సక్సెస్ అయితే అమ్మడికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడం పక్కా!!