Apple సంస్థ సెప్టెంబర్ 16 నుండి భారతదేశంలో iOS 18ని అధికారికంగా విడుదల చేసింది
iOS 18తో కస్టమ్ హోమ్ స్క్రీన్, రీడిజైన్ చేసిన కంట్రోల్ సెంటర్, అడ్వాన్స్‌డ్ సఫారి, మ్యాప్స్ వంటి ఫీచర్లకు యాక్సెస్ దక్కుతుంది
ఐఫోన్ 16 సిరీస్ మొబైల్ ఫోన్స్ iOS 18 ప్రీ-ఇన్‌స్టాల్‌తో వస్తుండగా, ఇప్పటికే ఉన్న అనేక ఐఫోన్ మోడల్స్ లో అప్‌డేట్ చేసుకోవచ్చు
అయితే అన్ని మొబైల్స్ ప్రతి ఫీచర్‌కు మద్దతివ్వవు. ముఖ్యంగా Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, కొత్త మోడల్‌లకు ప్రత్యేకంగా ఉంటాయి
iOS 18 అప్‌డేట్‌కు అర్హత ఉన్న iPhoneల జాబితా ఇదే: ఐఫోన్ 16, ఐఫోన్ 16 Plus, ఐఫోన్ 16 Pro, ఐఫోన్ 16 Pro Max ఐఫోన్ 15, ఐఫోన్ 15 Plus, ఐఫోన్ 15 Pro, ఐఫోన్ 15 Pro Max
iOS 18 అప్‌డేట్‌కు అర్హత ఉన్న iPhoneల జాబితా ఇదే: ఐఫోన్ 14, ఐఫోన్ 14 Plus, ఐఫోన్ 14 Pro, ఐఫోన్ 14 Pro Max ఐఫోన్ 13, ఐఫోన్ 13 mini, ఐఫోన్ 13 Pro, ఐఫోన్ 13 Pro Max
iOS 18 అప్‌డేట్‌కు అర్హత ఉన్న iPhoneల జాబితా ఇదే: ఐఫోన్ 12, ఐఫోన్ 12 mini, ఐఫోన్ 12 Pro, ఐఫోన్ 12 Pro Max ఐఫోన్ 11, ఐఫోన్ 11 Pro, ఐఫోన్ 11 Pro Max ఐఫోన్ SE (2వ తరం), ఐఫోన్ SE (3వ తరం)
iOS 18లో మంచి ఫీచర్లలో ఒకటి Apple ఇంటెలిజెన్స్. ఇది Apple పరికరాలలో విప్లవాత్మక మార్పు కోసం రూపొందించిన AI-ఆధారిత టూల్. అయితే, అక్టోబర్ 2024లో iOS 18.1 విడుదలయ్యే వరకు ఈ ఫీచర్‌లు అందుబాటులో ఉండవు.
మెరుగైన వాయిస్ సింథసిస్, ప్రిడిక్టివ్ టెక్స్ట్‌ను అందిస్తూ, మరింత సంభాషణాత్మకంగా, ఇమెయిల్‌లు, మెసేజ్‌లు, క్యాలెండర్ ఈవెంట్‌లను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని 'సిరి' కూడా అప్డేట్ ద్వారా పొందనుంది
Apple సొంత కొత్త ఇమేజ్ ప్లేగ్రౌండ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా పరిచయం చేయనుంది