ఆగస్టు 30 నుండి ఆసియా కప్-2023

ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌ 16వ ఎడిషన్. గత 15 ఆసియా కప్‌లలో 13 సార్లు వన్డే ఫార్మాట్లోనే జరగ్గా.. రెండుసార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో జరిగాయి
ఈ టోర్నీ 1984లో ఆరంభం అయింది. 1984లో మూడు దేశాల మధ్య జరిగిన ఆసియా కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది
అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో 1986లో మరోసారి నిర్వహించారు. అయితే క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతో పాటు సివిల్‌ వార్‌ కారణంగా భారత్ లేకుండానే రెండో ఎడిషన్‌ జరిగింది
లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం, శ్రీలంక ప్రభుత్వ దళాల మధ్య రాజీ కుదర్చడం కోసం భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్‌ కోసం శ్రీలంకకు భారత జట్టును భారత ప్రభుత్వం పంపించలేదు
1988 ఆసియా కప్‌లో భారత్ ఆడగా.. బంగ్లాదేశ్‌ ఆతిథ్యం నాలుగో జట్టుగా బరిలోకి దిగింది
1990లో పాకిస్థాన్‌ పాల్గొనలేదు. భారత్‌తో రాజకీయపరమైన విభేదాలు తలెత్తడంతో పాక్ ఆడలేదు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆడిన ఈ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది
టీమిండియా ఏడు సార్లు ఆసియాకప్ లో విజేతగా నిలిచింది. 1984 1988, 1990-91, 1995, 2010, 2016 (టీ20), 2018 సంవత్సరాల్లో ఆసియా కప్ ట్రోపీని టీమిండియా గెలిచింది
1984 నుంచి టీమిండియా ఈ టోర్నీలో మొత్తం 40 వన్డేలు ఆడింది. వాటిలో 31 వన్డేలు గెలిచింది
ఆసియా కప్ 2023 బుధవారం నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌, నేపాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ తో టోర్నీ మొదలుకానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది
భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. టోర్నీ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి