శోభిత ధూళిపాళ్ల .. అచ్చ తెలుగు అమ్మాయి.. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో ఇంకా ఫేమస్

రామన్ రాఘన్ 2.0 అనే ఒక హిందీ సినిమాతో వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది
ఆ తర్వాత గూడచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది
అటు బాలీవుడ్, వెబ్ సిరీస్ లు చేయడమే కాకుండా.. మేజర్ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై కనిపించింది
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో కూడా కీలక పాత్రలో కనిపించింది.. హాలీవుడ్‌లో మంకీ మ్యాన్‌ అనే సినిమాలో నటిస్తోంది
వాణిజ్య ప్రకటనల ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు చాలాసార్లు అందంగా లేనని ముఖం మీదే చెప్పి రిజెక్ట్ చేశారని తెలిపింది
ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ నెగ్గిన శోభిత.. సొంత ఊరు తెనాలి