రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు రామ్ చరణ్ చెన్నైలో జన్మించారు. ఆయనకు అక్క సుష్మిత, చెల్లెలు శ్రీజ ఉన్నారు
రామ్ చరణ్ టాలీవుడ్ లో ప్రముఖ అల్లు-కొణిదెల కుటుంబంలో ఓ భాగం. మెగా ఫ్యామిలీలో ఎంతో మంది స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే
ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు రామ్ చరణ్. అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల వంటి ప్రముఖ నటులు రామ్ చరణ్ కుటుంబ సభ్యులే
అపోలో ఛారిటీ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేనిని రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు
భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ చైన్ అయిన అపోలో హాస్పిటల్స్‌ కామినేని కుటుంబానిదే. రామ్ చరణ్, ఉపాసన జూన్ 20, 2023న హైదరాబాద్‌లో తమ మొదటి బిడ్డ కుమార్తెకు స్వాగతం పలికారు. ఆమె పేరు క్లిన్ కారా
రామ్ చరణ్.. మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు
రెండో సినిమా మగధీరతో దక్షిణాదిన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇక రంగస్థలం సినిమాతో తండ్రికి తగ్గ కొడుకుని అని నిరూపించుకున్నారు
ఇక ఆర్.ఆర్.ఆర్. సినిమాతో రామ్ చరణ్ .. గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. త్వరలోనే మరిన్ని సూపర్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు