రిలయన్స్ జియో సంస్థ భారతదేశంలో తన జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించింది
ప్రారంభ దశలో, ఈ సేవలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మరియు పూణెతో సహా ఎనిమిది నగరాల్లో మొదలవుతాయి
జియో ఎయిర్‌ఫైబర్‌తో, వినియోగదారులు ఇల్లు లేదా ఆఫీస్ స్థలం అయినా మొత్తం ఆవరణను కవర్ చేయడానికి హై-స్పీడ్ వైఫై సేవలను కూడా ఆస్వాదించగలరు
Jio AirFiber తో డిజిటల్ వినోదం, స్మార్ట్ హోమ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్‌తో లక్షలాది గృహాలను స్మార్ట్ హోమ్ గా మార్చబోతున్నాం అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు
జియో ఎయిర్‌ఫైబర్‌తో ప్రజల డిజిటల్ అవసరాలను తీర్చడానికి రిలయన్స్ ప్రయత్నిస్తూ ఉంది
Jio AirFiber ప్లాన్ల ద్వారా 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను పొందుతారు. క్యాచ్-అప్ టీవీని ఉపయోగించగలరు. Jio AirFiber ఒకే ఒక్క ప్లాన్ పదహారు వేర్వేరు OTT అప్లికేషన్‌ల సేవలను అందించడానికి సహాయపడుతుంది
Jio AirFiber వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్‌తో మూడు పరికరాలను ఉచితంగా పొందుతారు. WiFi రూటర్, 4k స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్-యాక్టివ్ రిమోట్ లు ఇందులో ఉంటాయి
వాట్సాప్‌లో బుకింగ్ ప్రారంభించడానికి 60008-60008 ని సంప్రదించండి
www.jio.com సైట్ లో బుక్ చేయొచ్చు. సమీపంలోని జియో స్టోర్‌ని సందర్శించండి.. మరిన్ని వివరాలు కూడా తెలుస్తాయి