జెమీమా రోడ్రిగ్స్ ముంబైలో పుట్టి పెరిగింది. ఆమె ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి, సోదరులతో కలిసి ముంబై లోకల్ రైలులో ప్రయాణించి ప్రాక్టీస్‌కు వెళ్ళేది
జెమీమా కేవలం 8 ఏళ్ల వయస్సులోనే తనకంటే చాలా పెద్ద వయసు ఉన్న ఆటగాళ్లతో పోటీ పడింది. శారీరకంగా చిన్నదైనా, టెక్నిక్, టైమింగ్ తో ప్రత్యేకమైన ప్లేయర్ గా మార్చింది.
2022 మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్ లో పేరు లేకపోవడం జెమీమా రోడ్రిగ్స్ కెరీర్‌లోని అత్యంత బాధాకరమైన క్షణం
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ప్రాక్టీస్‌కు వెళ్లాలంటే కూడా భయం వేసిన క్షణాలను అనుభవించింది
ఒక వారం విరామం తీసుకుని, కొత్త ఉత్సాహంతో తిరిగి శిక్షణ ప్రారంభించింది. ప్రతి వారం బాగా ప్రాక్టీస్ చేసినందుకు, ఆమె తనకు తాను చిన్న బహుమతులు ఇచ్చుకునేది
ఆత్మవిశ్వాసం ఆమెను మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించేలా చేసింది. కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే ఫలితం తప్పక లభిస్తుందనేది ఆమెను చూస్తే తెలుస్తుంది
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది
ఆసీస్ తో మ్యాచ్ లో జెమీమా 134 బంతులు ఎదుర్కొంది. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది
ఆమె వీరోచిత సెంచరీ కారణంగా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా సాధించి, ఫైనల్‌కు చేరుకుంది