యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’ పేరుతో అత్యంత అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించింది
యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్ వాచ్‌లు ‘వాచ్ సిరీస్ 9’, ‘వాచ్ అల్ట్రా 2’ ను కూడా విడుదల చేసింది
ఈ సారి టైప్-సీతో కూడిన ఛార్జింగ్‌ను ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో అమర్చింది. ఈ ఈవెంట్‌లో ఎయిర్‌ప్యాడ్‌లను యాపిల్ విడుదల చేయలేదు
ఐఫోన్ 15లో 6.1 అంగుళాల డిస్ప్లే, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే ఇస్తున్నారు. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఇవి లభ్యం కానున్నాయి
డైనమిక్ ఐలాండ్‌తో కూడిన కొత్త నాచ్ డిస్‌ప్లే, వెనక వైపు 2ఎక్స్ టెలిఫొటో సామర్థం ఉన్న 48 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్‌ను ఇచ్చారు
ఏ16 బయోనిక్ చిప్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో కూడిన ఛార్జింగ్ కూడా ఉన్నాయి
ఐఫోన్ 15 ధరలు భారత్‌లో రూ.79,900 (799 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం అవుతాయి. ఐఫోన్ 15 ప్లస్ ధరలు రూ.89,899 (899 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం కానున్నాయి.