అతిలోక సుందరి శ్రీదేవి అగ్ర నటిగా దేశాన్ని ఒక ఊపు ఊపేసింది

చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆమె కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు షోషించింది.. ఆమె అర్ధాంతరంగా మనల్ని విడిచి వెళ్లిపోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు
శ్రీదేవి కన్నవారు తెలుగువారే. తండ్రి అయ్యప్పన్‌ తమిళనాట స్థిరపడ్డ తెలుగువ్యక్తి. తల్లి రాజేశ్వరి తిరుపతికి చెందినవారు. తిరుపతి చుట్టుపక్కల చాలా మంది బంధువులు శ్రీదేవి కుటుంబానికి ఉన్నారు.
శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న మరణించింది. అదే సంవత్సరం జూలైలో తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
జాన్వీ సినిమా రంగంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చెల్లెలు ఖుషీ కపూర్ కూడా జోయా అక్తర్ చిత్రం ‘ది ఆర్చీస్’తో ఆమె అరంగేట్రం చేయనుంది
శ్రీదేవి అన్ని భాషల్లోకి తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. తమిళ చిత్రాలద్వారా శ్రీదేవి పరిచయం అయినా.. ఆమెకు సూపర్‌ స్టార్‌ డమ్‌ తీసుకుని వచ్చింది మాత్రం తెలుగు చిత్రాలే
శ్రీదేవి తెలుగునాట అప్పటి టాప్‌ హీరోస్‌ సినిమాలలో బాలనటిగానూ నటించింది, తరువాత వారి సరసనే హీరోయిన్ గా ఆడిపాడింది
తెలుగులో మూడు తరాల హీరోలతోనూ సూపర్‌ హిట్స్‌ చూసిన ఘనత సైతం శ్రీదేవి సొంతం
సూపర్ స్టార్ కృష్ణతో శ్రీదేవి అత్యధిక చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించింది
శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్‌గా శ్రీదేవి ఫొటోని డిస్‌ప్లే చేసింది