ప్రతి ఏటా జూలై 26న 'కార్గిల్ విజయ్ దివాస్' ను జరుపుకుంటారు
1999, జూలై 26న పాకిస్తాన్ సైన్యం పై భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేడుకలు నిర్వహిస్తారు
కశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న దురద్దేశంతో పాకిస్తాన్ సైన్యం ట్రైబల్ మిలీషియా మద్దతుతో 'ఆపరేషన్ బదర్' పేరిట చొరబాటుదారులను భారత సరిహద్దుల్లోకి పంపించింది
1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం మెుదలైంది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' అనే మిషన్ ప్రారంభించి.. దాదాపు రెండు నెలలపాటు పోరాడింది
ఈ యుద్దంలో భారత్ కు చెందిన 527 మంది సైనికుల అమరులయ్యారు. జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి.. భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత సైన్యం స్వాధీనం చేసుకుంది
ఈ యుద్ధ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రవాదులతో చేతులు కలిపి.. నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి ఆర్మీపై దాడికి తెగబడింది
అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు చేసి కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ చొరబాట్లలో పాక్ కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది
జులై 14 నాటికి భారత సైన్యం శత్రు మూకలను తరిమి కొట్టింది. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది
జూన్ 5న పాకిస్తాన్ ప్రమేయాన్ని వెల్లడించే పత్రాలను మన సైన్యం విడుదల చేయడంతో పాక్ ప్రపంచ దేశాల ముందు దోషిగా మిగిలింది
కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం కార్గిల్ వార్ మెమోరియల్ ను లడక్ సమీపంలోని ద్రాస్ టౌన్ లో ఏర్పాటు చేశారు