శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ‘దఢక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది
తన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది జాన్వీకపూర్
నాకు ‘దేవర’ సెట్స్‌ని వదిలి వెళ్లాలని అనిపించదు. షూటింగ్ పూర్తి అవ్వగానే అప్పుడే వెళ్లిపోవాలా? ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేదని జాన్వీ కపూర్ తెలిపింది
జూనియర్ ఎన్టీఆర్ తో నాకు మంచి స్నేహాం ఏర్పడింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఉంటారు. అతనిలోని ఈ గుణమే నాకు బాగా నచ్చుతుందని తెలిపింది జాన్వీ
కానీ రీసెంట్‌గా నాతో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పుడు సెట్‌లో ఎన్టీఆర్ లేరు. నేను చాలా లోన్లీగా ఫీలయ్యా.. ఆరోజు మొత్తం డల్‌గానే కూర్చొని, ప్యాకప్ చెప్పగానే నిరాశతో ముంబైకి తిరిగి వెళ్లిపోయానని జాన్వీ తెలిపింది
దేవర షూట్ లో ఆయన లేకపోతే అస్సలు షూట్ చేయబుద్ధి కాదని .. తారక్ తో కలిసి నటించే సీన్స్ ఎంత హై ఆక్టివ్ లో చేస్తానో.. ఆయన లేకుండా సీన్స్ చేయమంటే అంత నిరాశగా చేస్తానని తెలిపింది జాన్వీ కపూర్