వివాహేతర డేటింగ్ యాప్‌లో నాలుగు మిలియన్ల మంది భారతీయులు
వాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ లో ఏకంగా 40 లక్షలకు పైగా భారతీయులు
ఈ యాప్‌లో 65 శాతం పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు
గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం 148 శాతం పెరిగిందని సర్వేలో తేలింది
అత్యధికంగా బెంగళూరులో.. మొత్తం యూజర్లలో 18 శాతం మంది
హైదరాబాద్ 17 శాతంతో రెండో స్థానంలో
ఢిల్లీ(11 శాతం), ముంబై(9 శాతం), పూణె(7 శాతం)తో తర్వాతి స్థానాల్లో.. టైర్2 నగరాలైన లక్నో, పాట్నా, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్ లాంటి నగరాల్లోనూ వేగంగా పెరుగుతోంది
ఆధునిక సంబంధాలపై ప్రజల దృక్పథంలో వస్తున్న నిశ్శబ్ద మార్పుకు, డిజిటల్ వినియోగం పెరుగుదలకు ఇది స్పష్టమైన సంకేతమని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ తెలిపారు