పాస్ పోర్టు రాగానే చాలు విదేశాలకు చెక్కేయాలని అనుకుంటూ ఉంటారు కొందరు. అయితే వీసా ప్రాసెస్ గురించి భయపడే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.

వీసా లేకుండా భారతీయులు కొన్ని దేశాలలో తిరగొచ్చు తెలుసా..? చాలా దేశాలు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మరికొన్ని దేశాలకు వెళ్లాలంటే అసలు వీసానే అవసరం లేదు.
భారతీయ పాస్‌పోర్ట్‌ని కలిగి ఉంటే, కొన్ని దేశాలకు హ్యాపీగా వెళ్లిపోవచ్చు. మీ అంతర్జాతీయ ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వవు
బార్బడోస్: కరేబియన్‌లోని అత్యంత అందమైన దేశాలలో బార్బడోస్ ఒకటి.. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు
ఫిజీ: వీసా లేకుండా ఈ ఫిజీ దేశంలో మీరు 120 రోజులు గడపవచ్చు, ఫిజీలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పగడపు దిబ్బలు ఈ దేశానికి ప్రత్యేక ఆకర్షణ
భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో ఉన్న భూటాన్‌కు వీసా లేకుండానే వెళ్లవచ్చు
నేపాల్: అక్కడికి రోడ్డు, రైలు, వాయుమార్గం ద్వారా వెళ్ళవచ్చు. భారత్ నుంచి నేపాల్‌లోని ఖాట్మండుకు విమాన సర్వీసులు ఉన్నాయి. భారతీయులకు నేపాల్ వెళ్లాలంటే వీసా అవసరం లేదు. మీ భారతీయ పౌరసత్వం కల్గిన ఐడీ కార్డ్ ఉంటే చాలు
ట్రినిడాట్, టొబాగో: ఇది ఒక ద్వీప దేశం. ఇక్కడ కూడా వీసా లేకుండా 90 రోజులు భారతీయులు ప్రయాణం చేయొచ్చు. ఇక్కడ రకరకాల పక్షులు, జంతువులు ఉంటాయి
కజకిస్తాన్ లో 14 రోజుల పాటు వీసా లేకుండా భారతీయులు తిరగొచ్చు. అందమైన ప్రదేశాలు, సుందరమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి
మారిషస్: భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగల దేశాలలో మారిషస్ కూడా ఒకటి. మారిషస్ భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ దేశంలో 90 రోజుల వరకు ఎలాంటి వీసా లేకుండా పర్యటించవచ్చు