ఆ కంపెనీల సీసీటీవీలు భారత్ ఎందుకు బ్యాన్ చేసిందంటే?

సీసీటీవీ కెమెరాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఏప్రిల్ 1 నుంచి సీసీటీవీ కెమెరాల కంపెనీలు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే విక్రయించనున్నాయి
స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (STQC) లేని సీసీటీవీ కెమెరాల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది
STQC లేని సీసీటీవీ యూనిట్ల అమ్మకాలను 2025 ఏప్రిల్ 9 నుంచి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ నిషేధించింది
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సీసీటీవీ కెమెరాలను అమ్ముకోవడానికి వ్యాపారులకు 2026 మార్చి 31 వరకు అనుమతి ఇచ్చింది
ఏప్రిల్ 1 నుంచి స్వదేశంలోని తయారైన సీసీటీవీ కెమెరాలనే భారత వ్యాపారులు అమ్మాల్సి ఉంటుంది
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య హిక్‌విజన్, టీపీ-లింక్ వంటి చైనాకు చెందిన సీసీటీవీ తయారీ కంపెనీలపై ప్రభావం చూపనుంది