చంద్రయాన్-3 మిషన్ తో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆదిత్య L1 ద్వారా సూర్యుని గురించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.

చంద్రుడు, సూర్యుడి తర్వాత ఇప్పుడు సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం భారత్ చేస్తోంది.
భారతదేశం సముద్రయాన్ మిషన్‌ను సిద్ధం చేస్తోంది. సముద్రయాన్ మిషన్ భాగంగా స్వదేశీ జలాంతర్గామి మత్స్య 6000 సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతు వరకు ముగ్గురు నావికులను తీసుకువెళుతుంది
మిషన్ సముద్రయాన్ కింద రహస్యాన్ని అన్వేషించడానికి సముద్రపు లోతుల్లోకి డైవ్ చేసే మానవసహిత సబ్‌మెర్సిబుల్ మత్స్య 6000ని కేంద్ర భూ శాస్త్రాల మంత్రి కిరెన్ రిజిజు పరిశీలించారు
ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు సోషల్ మీడియా 'X'లో పోస్ట్ చేశారు
సబ్‌మెర్సిబుల్ మత్స్య 6000 చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో నిర్మించారు. సముద్రయాన్ మిషన్ లో భాగంగా లోతైన సముద్రంలో భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మిషన్ ఇది. సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతుకు ముగ్గురు నావికులను పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇది మొదటగా 500 మీటర్ల మేర నీటి అడుగులకు ప్రయాణం చేయనుంది. సముద్ర అడుగు భాగంలోకి కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించనుంది
2024 లేదా 2025లో చెన్నై తీరంలో బంగళాఖాతంలోకి ముగ్గురు ఆక్వానాట్స్‌ను మత్స్య 6000 ద్వారా పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు
ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మానవసహిత సబ్‌‌లను అభివృద్ధి చేశాయి. ఆ లిస్టులోకి భారత్ కూడా చేరనుంది