మెటా కంపెనీ ట్విట్టర్ కు పోటీగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే

ట్విట్టర్ లాగా థ్రెడ్స్ టెక్స్ట్ అప్‌డేట్‌లను షేర్ చేయడం కోసం ఉపయోగిస్తారు
మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. ఇందులో పోస్ట్‌లు 500 అక్షరాల వరకు ఉంటాయి
ఇందులో 5 నిమిషాల నిడివిలో లింక్‌లు, ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయవచ్చని మెటా తెలిపింది
థ్రెడ్‌లను ఉపయోగించాలనుకుంటే.. యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యాప్‌ని తెరిచి, "ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్"పై క్లిక్ చేయండి
మీరు ఇప్పటికే మీ ఫోన్ లో Instagram యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, థ్రెడ్స్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా లాగిన్ చేస్తాయి
ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఇన్‌స్టాల్ చేయకుంటే, దాన్ని ఇన్‌స్టాల్ చేయమని అడుగుతుంది
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, థ్రెడ్స్ ను లాగిన్ చేయగలుగుతారు. లాగిన్ అయిన తర్వాత, మీరు మీ పోస్టులను చేయడమే కాకుండా.. ఫాలోవర్స్ కు మెసేజ్ లను పంపడం ప్రారంభించవచ్చు
ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే, థ్రెడ్స్ లో యూజర్స్ స్నేహితులు, క్రియేటర్‌లను ఫాలో చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు అనుసరించే వ్యక్తులతోనూ కనెక్ట్ అవ్వవచ్చు