వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతూ ఉంటుంది. అయితే సీజనల్ వ్యాధుల నుండి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు

వర్షాకాలంలో గాలిలోని తేమలో ఉండే బ్యాక్టీరియా కారణంగా కంటికి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం వుంది. కళ్ళు ఇన్ఫెక్షన్ కారణంగా ఎర్రబడి మంటగా అనిపిస్తాయి. కళ్ళ విషయంలో జాగ్రత్త అవసరం
దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి సీజనల్ వ్యాధుల కిందకి వస్తాయి
వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్- ఏ రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది
చాలా మందికి దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకరి నుంచి మరోకరికి దగ్గు వ్యాప్తి చెందే అవకాశం ఉంది
డెంగ్యూ, మలేరియాల జ్వరాలు సోకకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
తాజా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు
పానీపూరీ, పండ్ల రసాలు, ఇతర జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. కలుషిత ఆహారం, కలుషిత నీటిని దూరంగా ఉంచడం వల్ల డయేరియా, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు