హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి. దీనిని శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు

సోదరసోదరీమణులు ప్రేమకు ప్రతీకగా ఈ పండుగని నిర్వహిస్తారు. ఈ రోజున సోదరీమణులు సోదరులకి రాఖీ కట్టి వారి దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థిస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు
రాఖీ కట్టినందుకు సోదరులు వారికి బహుమతులు అందిస్తారు. రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు పాటించాలి. అదేవిధంగా కట్టిన రాఖీ తీయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి
కొంతమంది రాఖీని తీసివేసి ఎక్కడ పడితే అక్కడ పారవేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. దీని వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు
రాఖీని ఎక్కువ రోజుల పాటు చేతికే ఉంచుకుంటే అపవిత్రం అవుతుంది. కొన్ని రోజుల తరువాత మంచి రోజుని చూసుకుని రాఖీని తొలగించాలి
తొలగించిన రాఖీని ఎక్కడబడితే అక్కడ పడేయకూడదు. ఓ ఎర్రని వస్త్రంలో చుట్టి దేవుని మందిరంలో ఉంచండి. విరిగిపోయిన లేదా తెగిపోయిన రాఖీలను చేతిలో ఉంచకూడదు
విరిగిపోయిన రాఖీలను ఎక్కడబడితే అక్కడ పడవేయకుండా.. ప్రవహించే నీటిలో వేయాలి. దగ్గరలో ప్రవహించే నీరు లేని పక్షంలో, విరిగిపోయిన రాఖీని ఒక రూపాయి నాణెంతో పాటు చెట్టు కింద ఉంచాలి
రాఖీ కట్టేటప్పుడు, తీసేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పురాణాలు చెబుతున్నాయి
అలాగే పండుగ అయిన తరువాత రాఖీని ఎలా తీయాలి.. చేతికి ఉండగానే పెరిగిపోతే, జరిగితే ఏంచేయాలి. అసలు రాఖీ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు