ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ
కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం రూఫ్‌టాఫ్ సోలార్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం 75,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం
2024-25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు
ఈ పథకం ద్వారా తక్కువ విద్యుత్ బిల్లులతో పాటు ప్రజలకు ఉపాధి కూడా కలుగుతుందని ప్రధాని తెలిపారు. పట్టణ, స్థానిక సంస్థలు, పంచాతీలు తమ అధికార పరిధిలో సోలార్ సిస్టమ్స్‌ని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు
అధికారిక వెబ్‌సైట్‌ను https://pmsuryaghar.gov.in/ హోమ్‌పేజీలో అప్లై ఫర్ రూఫ్‌టాప్ సోలార్‌పై క్లిక్ చేయాలి
మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మీ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్‌ని పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. సోలార్ రూఫ్‌టాప్ కోసం అప్లై చేసుకోవాలి
డిస్కం నుంచి సాధ్యాసాధ్యాల ఆమోదం గురించి మీకు సమాచారం వస్తుంది. ఆమోదం పొందిన తర్వాత మీ డిస్కంలో రిజిస్టర్ విక్రేత నుంచి సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేస్తారు
ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత ప్లాంట్ వివరాలు సమర్పించి, నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డిస్కమ్ తనిఖీ చేసిన తర్వాత వారు పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్‌ని రూపొందిస్తారు
ఒకసారి కమీషనింగ్ రిపోర్ట్ పొందిన తర్వాత, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్‌ని సమర్పించాలి. 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాతో మీ సబ్సిడీ డబ్బుల్ని అందుకుంటారు
రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ కింద, సౌర ఫోటోవోల్టాయిక్ (PV) ప్యానెల్‌లు భవనం, ఇల్లు లేదా సొంతింటి మీద స్థిరంగా ఏర్పాటు చేస్తారు