మన శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. కొలెస్ట్రాల్ అధికమవ్వడం మన ప్రాణాలకే ప్రమాదం
గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్ కంట్రోల్ ఉంచుకోవాలి
శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే.. కానీ అది మితిమీరితేనే మనకు ప్రమాదమే. లైఫ్ స్టైల్ లో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి కారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు
కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్, రెండు మంచి కొలెస్ట్రాల్. మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువైతేనే ప్రమాదం. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి సహాయపడుతుంది
మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధిక BP, గుండె జబ్బులకు కారణమవుతుంది
శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి 200 mg/dl కంటే తక్కువగా ఉండాలి. ఇది LDL 100 mg/dl కంటే తక్కువ, HDL 60 mg/dl కంటే ఎక్కువ, ట్రైగ్లిజరైడ్ 150 mg/dl కంటే తక్కువగా ఉండాలి
బీపీ అకస్మాత్తుగా పెరిగినట్లయితే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ టెస్ట్‌ని చేయించుకోవాలి. అంతేకాకుండా చెమట ఎక్కువగా పడుతున్నట్లయితే కొలస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి
కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మిర్లు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలుగా పరిగణిస్తారు. ప్రతిరోజూ ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లయితే డాక్టర్‌ని సంప్రదించడం అత్యుత్తమం