హాయ్ నాన్న ఈవెంట్ లో మృణాల్, నాని సందడి

నేచురల్​ స్టార్ నాని లీడ్​ రోల్​లో రూపొందిన చిత్రం 'హాయ్​ నాన్న'
తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్​తో ఈ సినిమాను డైరెక్టర్ శౌర్యువ్‌ తెరకెక్కించారు
డిసెంబరు 7న ఈ సినిమా పాన్​ ఇండియా లెవెల్​లో విడుదల కానుంది
వైజాగ్​లో మూవీ టీమ్​ ఓ గ్రాండ్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకకు నాని,మృణాల్​తో పాటు బేబి కియార హాజరై సందడి చేశారు
నా యాక్షన్‌ మూవీస్​ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో పెద్ద హిట్‌ అయ్యాయని.. ఇక ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు యూఎస్‌, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ విజయాన్ని సాధించాయన్నారు నాని
నేపథ్యం ఏదైనా సరే అన్ని సినిమాలు ఓ రేంజ్​లో ఆడిన ప్రాంతం వైజాగ్‌ అని చెప్పుకొచ్చాడు నాని
శౌర్యువ్‌ లాంటి కొత్త డైరెక్టర్లతో పనిచేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. ఆయన భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానన్నాడు నాని.
గతంలో 'సీతారామం' మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 'హాయ్‌ నాన్న'తో మరోసారి మీ అందరి ముందుకు వచ్చానని తెలిపింది మృణాల్.
తెలుగు అమ్మాయిలా నన్ను ఆదరిస్తున్నందుకు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది మృణాల్
ఈ తండ్రీ కూతుళ్ల స్టోరీతో మీరు తప్పకుండా ప్రేమలో పడతారు.. అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటాను: మృణాల్