రాశీ ఖన్నా బాలీవుడ్ కు కొత్తేమీ కాదు.. 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సౌత్ కు వచ్చేసింది రాశీ ఖన్నా
ముఖ్యంగా తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగు కూడా బాగా మాట్లాడగలదు
ఆ తర్వాత యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది
సుప్రీం సినిమాలో బెల్లం శ్రీదేవి క్యారెక్టర్, తొలిప్రేమ సినిమాలో వర్ష ఆమె కెరీర్ లో స్పెషల్. ఇక ఏంజెల్ ఆర్నా కూడా 'ప్రతి రోజు పండగే' సినిమాలో బాగా కనెక్ట్ అవుతాయి
రాశీ ఖన్నా తెలుగులో గోపీచంద్ జిల్.. సందీప్ కిషన్‌తో ‘జోరు’, రవితేజతో ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’, రామ్ పోతినేనితో 'హైపర్', ‘శివమ్’, విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’ సినిమాలు చేసింది
ఇప్పుడు రాశీ ఖన్నా చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఇటీవల ఆమె హిందీలో ఫర్జీ వెబ్ సిరీస్ లో సందడి చేసింది
ఆమె అప్పుడప్పుడు పలు ఊర్లలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వస్తూ ఉంది. కొద్దిరోజుల కిందట సూర్యాపేటలో కూడా ఆమె తళుక్కుమంది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన రాశీ ఖన్నాను చూడడానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు