పరీక్షల ఒత్తిడి నుండి బయటపడాలంటే?

అకడమిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు.. మంచి మార్కులు సాధించాలని, ర్యాంకు కొట్టాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు
విద్యార్థుల శ్రేయస్సు, విజయానికి విద్యాపరమైన ఒత్తిడిని అధిగమించడం చాలా కీలకం. టీచర్లు, తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు మద్దతు ఇవ్వాలని నిపుణులు చెబుతారు.
స్టడీ మెటీరియల్‌ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం, సంక్లిష్టమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు భారం తగ్గుతుంది.
విరామాలు, తగినంత విశ్రాంతితో కూడిన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవాలి. చిన్న, సాధించగల లక్ష్యాలపై దృష్టి సారించి, స్టడీ మెటీరియల్‌ని పలు భాగాలుగా విభజించుకోవాలి
రెగ్యులర్ బ్రేక్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడును రీఛార్జ్ చేస్తాయి. బ్రేక్ టైమ్‌లో స్ట్రెచింగ్‌ లేదా వాకింగ్‌ వంటివి చేస్తే, ఫోకస్‌, మానసిక స్థితిని మెరుగుపరుస్తుస్తాయి
ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి శ్వాస, ధ్యానం, యోగా వంటి సడలింపు పద్ధతులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలి. రిలాక్సేషన్ టెక్నిక్‌లు ఒత్తిడి, అనుచిత ఆలోచనల నుండి మనస్సు దృష్టిని మళ్లించడంలో సహాయపడతాయి
స్టడీ మెటీరియల్‌లను క్రమబద్ధంగా ఉంచడం చివరి నిమిషంలో భయాందోళనలను తగ్గిస్తుంది, ఫోకస్‌ పెంచుతుంది. అయోమయంగా లేని వాతావరణం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది
ఫలితాలపై కాకుండా ప్రయత్నాలు, అభ్యాసంపై దృష్టి పెట్టండి. ప్రిపరేషన్‌లో చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్‌ చేసుకోండి. పోషకాహారం మంచిదే. సమతుల్య భోజనం, మంచి స్నాక్స్‌ ముఖ్యం. విటమిన్లు, మినరల్స్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్ ఏకాగ్రతకు ఇంధనంలా పని చేస్తుంది.