సరైన నిద్ర లేకపోతే మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర అనేది మనిషిని రిఫ్రెష్ చేయడమే కాదు.. శరీరం, మనస్సు సక్రమంగా పనిచేయడానికి కూడా కారణం.
నిద్రకు కేటాయించాల్సిన సమయాన్ని ఇతర విషయాలకు కేటాయించారంటే మాత్రం పెద్ద తప్పు చేస్తున్నట్లే!
నిద్రపోవడం వలన మన శరీరంలోని ఎన్నో భాగాలు రిలాక్స్ అవుతాయి. వాటికి కూడా రీఛార్జ్ అవ్వడానికి సమయం ఇస్తే చాలా బెటర్
రోగనిరోధక వ్యవస్థ సరిగా పని చేయడం కూడా ముఖ్యమే!! నిద్రకు ప్రతిస్పందనగా విడుదలయ్యే హార్మోన్లు ఒత్తిడి, ఆకలి, జీవక్రియలను నియంత్రిస్తాయి.
చాలామంది రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఉదయం లేవగానే ఎంతగానో చిరాకు పడుతున్నారు
నిద్ర సరిగా లేకపోతే మానసికంగానే కాకుండా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
తగినంత నిద్ర లేకపోవడం వల్ల స్థూలకాయం, గుండె వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఉంటుంది. కడుపు నిండుగా ఉంటే నిద్ర పట్టడం కష్టమౌతుంది. అందుకే రాత్రి పూట భోజనం ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ తేలిగ్గా ఉండాలి
రాత్రి ఎప్పుడూ నిద్రపోవడానికి 2 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిద్ర పోవడానికి 1-2 గంటల ముందే టీవీ, మొబైల్ ఫోన్స్ వంటివి చూడకుండా ఉండాలి
పడకగదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం మూలాన నిద్ర ప్రశాంతంగా పడుతుంది. సాయంత్రం వేళ కాఫీ లేదా టీ తాగడం వల్ల ఆ రోజు రాత్రి నిద్రకు భంగం వాటిల్లుతుంది
ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొలపడం వల్ల సరైన నిద్ర షెడ్యూల్ ను పాటించాల్సి ఉంటుంది