చేపలు కంటి చూపుకు చాలా మంచిది. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది.
కంటి చూపును బలోపేతం చేయడానికి ఆహారంలో బాదంపప్పును కూడా చేర్చుకోవచ్చు. క్యాటరాక్ట్ సమస్య తొలగిపోతుంది
విటమిన్ ఎ, లుటీన్, జింక్ వంటివి గుడ్లలో ఉంటాయి, ఇవి కళ్ళకు ఆరోగ్యకరం. విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని రక్షిస్తుంది. జింక్ రాత్రిపూట కళ్ళు చూడటానికి సహాయపడుతుంది
కంటిలోని లెన్స్‌ను కప్పేసేదాన్ని కంటిశుక్లం అంటారు. వయస్సు మీదపడిన వారు ఎక్కువగా కంటిశుక్లం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు
రెటినిటిస్ పిగ్మెంటోసా అంటే జన్యుపరమైన కంటి సమస్య. ఇది దృష్టి లోపం, రెటీనా క్షీణతకు దారితీస్తుంది. అసహజమైన రెటీనా మాక్రోఫేజ్‌లు రెటీనా కణజాలం, దృష్టిని కోల్పోవడానికి కారణమవుతాయి
దృష్టి లోపాన్ని నివారించడానికి మీ కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయని నిపుణులు చెబుతూ ఉంటారు