హ్యాపీ బర్త్ డే నాని.. ఈ విషయాలు మీకు తెలుసా?

నాని.. వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఒక హీరోకి క్యూ కడతారంటే ఇప్పటి నటీ నటుల్లో 'నాని' ఒకరు.
కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో నాని ఎప్పుడూ ముందు ఉంటాడు. కష్టపడి ఎదిగిన వాడు కాబట్టి.. ట్యాలెంట్ ఉన్న ఎంతో మందికి తన వంతు సాయం చేస్తూ ఉంటాడు
నాని హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. అతను సెయింట్ అల్ఫోన్సా హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజీలో పూర్తీ చేశాడు. హైదరాబాద్‌లోని వెస్లీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు
రేడియో జాకీగా నాని పనిచేశాడు. 'నాన్-స్టాప్ విత్ నాని' అనే ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేశాడు. సినిమాలపై ఉన్న ఇష్టం కారణంగా లెజెండరీ దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు
నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా 'రాధా గోపాలం' (2005), 'అల్లరి బుల్లోడు' (2005), 'అస్త్రం' (2006), 'ఢీ' (2007) వంటి చిత్రాలకు కూడా పనిచేశాడని చెబుతారు
నాని బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగులో 'ఓకే బంగారం'లో దుల్కర్ సల్మాన్ కు వాయిస్ ఇచ్చి ఔరా అనిపించాడు. ఇక 'లయన్ కింగ్'లో 'సింబా' క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పి పిల్లలకు మరింత దగ్గరయ్యాడు. 'డి ఫర్ దోపిడీ', 'అమోలి', 'ఈ మాయ పేరేమిటో' వంటి సినిమాలకు నారేటర్ గా కూడా చేశాడు
నేచురల్ స్టార్ నాని పాపులర్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 2'కి టీవీ హోస్ట్‌గా కూడా చేశారు. సద్గురు వంటి ప్రముఖ వ్యక్తులకు హోస్ట్‌గా కూడా కనిపించాడు
నిర్మాతగా కూడా నాని సక్సెస్ ను అందుకున్నాడు. తన నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’తో ఇప్పటికే కొంతమంది దర్శకులకు లాంచ్ చేశాడు. ‘డి ఫర్ దోపిడీ’, ‘విస్మయం’, ‘మీట్-క్యూట్’, ‘హిట్' సిరీస్ కు నిర్మాతగా ఉన్నాడు
నాని 'వి'లో సుధీర్ బాబుతో, 'దేవదాస్'లో నాగార్జున, ఆది పినిశెట్టితో 'నిన్ను కోరి', విజయ్ దేవరకొండతో 'ఎవడే సుబ్రమణ్యం', తనీష్‌తో 'రైడ్' సినిమాల్లో చేశాడు
గత ఏడాది 'హాయ్ నాన్న' సినిమాతో అందరినీ మెప్పించిన నాని.. త్వరలో 'సరిపోదా శనివారం' సినిమాతో ఉర్రూతలూగించబోతున్నాడు