మన శరీరంలో కిడ్నీ కీలకమైన అవయవం.. శరీరంలోని విష పదార్థాలను వడపట్టి మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది
అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చని నీరు తాగడానికి ప్రయత్నించాలి
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. బరువును నియంత్రించుకోవాలి
అలా చేస్తే కిడ్నీల నుంచి యూరియా, సోడియం వంటి విషపూరిత పదార్థాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవాలి
ఆయిల్, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుకూరలు తినాలి
ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ప్యాకింగ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి
మధుమేహం ఉంటే, మీ మూత్రపిండాలను రక్షించడానికి ఉత్తమ మార్గం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి
రెగ్యులర్ వ్యాయామంతో మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది
కిడ్నీ వ్యాధికి ధూమపానం కూడా ప్రధాన ప్రమాద కారకం. పొగత్రాగడం మానేయండి. మద్యపానం కూడా విడిచిపెట్టడం మంచిది