జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న కీలకమైన నిర్ణయాలు ఇవే!!

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు
పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని అన్నారు
విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు
జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 73 కింద జారీ చేసిన డిమాండ్ నోటీసులపై వడ్డీ, పెనాల్టీని మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు
ప్రయాణికులకు రైల్వే సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు, ప్రయాణికులు బసచేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి
విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు
పన్ను డిమాండ్ నోటీసుపై పెనాల్టీపై వడ్డీని మాఫీ చేయాలని కౌన్సిల్ సిఫార్సు
పన్ను అధికారులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీళ్లను దాఖలు చేయడానికి 20 లక్షల రూపాయల పరిమితిని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు. ఇందులో హైకోర్టుకు రూ.కోటి, సుప్రీంకోర్టుకు రూ.2కోట్ల పరిమితి
అన్ని రకాల సోలార్‌ కుక్కర్‌లపై 12 శాతం జీఎస్టీ. స్టీల్‌, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ. స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు