మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మీకు బ్యాంకులలో రుణాలను అందిస్తారు.
750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరును మెయిన్టైన్ చేస్తూ ఉంటే ఏదైనా బ్యాంకు మీకు సులభంగా లోన్ ఇస్తుంది
రుణాలు, క్రెడిట్ కార్డ్‌లు, తనఖాలు, యుటిలిటీ సేవలతో సహా వివిధ రకాల వాటికి క్రెడిట్ స్కోరును అర్హత ప్రమాణంగా చూస్తూ ఉంటారు. అధిక క్రెడిట్ స్కోర్.. తక్కువ రిస్క్ రుణగ్రహీతను సూచిస్తుంది
తక్కువ క్రెడిట్ స్కోరు కారణంగా మీకు కొన్ని సార్లు రుణాలు పుట్టకపోవచ్చు.. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్లు కట్టేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మంచి క్రెడిట్ స్కోరు మీకు దక్కుతుంది
మీ నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తున్నట్లయితే అది మీ క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది
మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో మీరు ఎంత శాతాన్ని ఉపయోగించారు. మీ క్రెడిట్ వినియోగం 30 శాతం కంటే ఎక్కువగా ఉంటే అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అవసరాలను తీర్చుకోవడానికి మీరు అసురక్షిత రుణాలను అంటే వ్యక్తిగత రుణాలను తీసుకోకుండా ఉండాలి
ఒకటికి మించిన క్రెడిట్ కార్డ్స్ ఉంటే, వాటిపై అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ లు ఉంటే, మొదట అత్యధిక వడ్డీ రేటు ఉన్న కార్డుల బ్యాలెన్స్ లను చెల్లించడంపై దృష్టి పెట్టండి. దీనివల్ల మీ మొత్తం వడ్డీ ఖర్చులు తగ్గుతాయి
క్రెడిట్ కార్డులను గరిష్టంగా ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే ఇది మీ క్రెడిట్ స్కోరును బాగా దెబ్బతీస్తుంది
క్రెడిట్ కార్డు చెల్లింపులతో పాటు, హోం లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలేవైనా ఉంటే.. వాటిని కూడా సకాలంలో, ప్రతీ నెల గడువు లోపు చెల్లించండి
అవసరమైతే తప్ప క్రెడిట్ కార్డులను రద్దు చేయకండి. మీ క్రెడిట్ కార్డ్ ఎంత పాతదైతే, అది మీ క్రెడిట్ స్కోర్‌కు అంత మంచిది