ఈరోజుల్లో ఒత్తుగా, దృఢంగా, లాంగ్ గా ఉండే జుట్టు ఉన్నవారు చాలా తక్కువ

కొత్త స్టైల్స్ పేరుతో ఉన్న జుట్టుని కూడా కోల్పోతున్న యువత
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ప్రొటీన్, ఐరన్, విటమిన్ ఎ,బి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి
ఎగ్ వైట్, చికెన్, ఫిష్, పన్నీరు, సోయా ఉత్పత్తులు, ఆకుకూరలు, శనగలు వంటివాటిలో ప్రొటీన్ అధికం.
పాలకూర, టోఫు, గోధుమ రొట్టె, ఓట్స్ తో తయారు చేసినవి, బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్ తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందంటున్న వైద్యులు
చికెన్, అవకాడో, చిక్కుళ్లులో విటమిన్ బి, గుడ్లు, బెర్రీలు, కొవ్వుచేప, చిలకడదుంపల్లో విటమిన్ ఎ లభిస్తాయి.
ఉసిరి, భృంగరాజ్, కలబందతో తయారు చేసిన నూనెను వాడటం వల్ల చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.