వర్షాకాలం వచ్చిందంటే ఇంటి పట్టున చాలా మంది ఉంటారు. అలాంటి సమయంలో ఏది పడితే అది తింటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే

వర్షాకాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కు దూరంగా ఉండండి
ఇష్టం వచ్చినట్లు ఇంట్లో కూర్చొని బజ్జీలు తినేయకండి.. ఆయిల్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
పానీపూరీ ఈ కాలంలో తినకపోవడమే మంచిది. పానీ పూరీకి సంబంధించి వాడే నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది
విరోచనాలు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు కలగచ్చు. ఈ కాలంలో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు
పచ్చి కూరగాయలను ఈ కాలంలో తినడం వలన గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి
వర్షాల సమయంలో చేపలు రొయ్యలు వంటివి తీసుకోవద్దు.. ఆ సమయంలో అవి సంతానం వృద్ధి చేస్తాయి
పుట్టగొడుగులని కూడా ఈ కాలంలో తీసుకోవద్దని నిపుణులు చెబుతూ ఉంటారు. బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
వర్షా కాలంలో పెరుగు, పండ్ల రసాలను కూడా తీసుకోకుండా ఉండటమే బెస్ట్