ఐకానిక్ 'ఛయ్య.. ఛయ్య' సాంగ్ వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా 'దిల్ సే'.. ఈ సినిమా తెలుగులో 'ప్రేమతో' పేరుతో విడుదల అయింది
షారుఖ్ ఖాన్ సరసన మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించింది
ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా 'ఛయ్య.. ఛయ్య' సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది.
ట్రైన్ మీద షారుఖ్ ఖాన్ తో కలిసి మలైకా అరోరా వేసే స్టెప్స్ ను ఏ మూవీ లవర్ కూడా మరచిపోడు. ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ కొరియోగ్రాఫ్ ఉన్న సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది
ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ అయిన ఫరా ఖాన్ ఈ పాటను కంపోజ్ చేశారు
ఛయ్య.. ఛయ్య సాంగ్ కోసం చాలా మంది ప్రముఖ నటీనటులను సంప్రదించామని.. అందుకు చాలా మంది తిరస్కరించారని ఫరా తెలిపారు. ఆ పాట చిత్రీకరణకు రెండు రోజుల ముందు మలైకా అరోరాను కలిస్తే తాను ఓకే చెప్పిందని ఫరా ఖాన్ చెప్పుకొచ్చారు
శిల్పాశెట్టి, రవీనా టాండన్‌తో సహా 6-7 మందిని సంప్రదించగా.. ప్రతి హీరోయిన్ పాట చేయడానికి నిరాకరించారు, ఏదీ వర్కవుట్ కాలేదు
ఆ సమయంలో మలైకాకు కనీసం డ్యాన్స్ వచ్చో లేదో కూడా తనకు తెలీదని ఫరా చెప్పారు. కానీ సరైన సమయానికి.. సరైన ప్లేస్ లో మలైకా ఉండడంతో ఆ సూపర్ హిట్ సాంగ్ లో అవకాశం దక్కించుకోగలిగింది
ఈ పాట కదులుతున్న రైలు మీద షూట్ చేశారు. AR రెహమాన్ సంగీతానికి.. గుల్జార్ సాహిత్యంతో కలిసి సాంస్కృతిక సరిహద్దులను దాటిన ఒక పాట ఏర్పడింది
పాట పిక్చరైజేషన్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఫరా ఖాన్ చేసిన డేరింగ్ కొరియోగ్రఫీ, సంతోష్ శివన్ ఉత్కంఠభరితమైన సినిమాటోగ్రఫీతో కలిసి మరపురాని సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది