విపరీతంగా డిజిటల్ స్క్రీన్ ను చూస్తున్నారా?

ఇది డిజిటల్ యుగం. కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ ను విపరీతంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి మన దైనందిన దినచర్యలలో భాగమైపోయాయి
కొందరు ఉద్యోగంలో భాగంగా చూస్తుంటే.. మరికొందరు వినోదం కోసం, ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటం కోసం ఎక్కువసేపు గడిపే అవకాశం ఉంది
మనం జీవించే, పని చేసే విధానాన్ని ఈ డిజిటల్ పరికరాలు పూర్తిగా మార్చినప్పటికీ, అధిక స్క్రీన్ సమయం మన కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ ఉంటే కళ్లు ఒత్తిడికి గురవుతాయి. కళ్లు పొడిబారడం, దురద, కళ్లలో మంటలు వంటి లక్షణాలు ఉంటాయి
డిజిటల్ స్క్రీన్‌లు హై-ఎనర్జీ బ్లూ లైట్‌ను విడుదల చేస్తాయి. ఇవి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. కంటికి ఒత్తిడి, రెటీనా దెబ్బతినడం వంటి వాటితో ముడిపడి ఉంటుంది. డిజిటల్ స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి చాలా ప్రమాదకరం
ఎక్కువ కాలం స్క్రీన్‌ని చూస్తూ ఉండడం వల్ల వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD), కంటిశుక్లం, రెటీనా దెబ్బతినడం వంటి ప్రమాదాన్ని పెంచుతుంది
స్క్రీన్ లను చూసే సమయాన్ని తగ్గించడం, మంచి స్క్రీన్ అలవాట్లను పాటించడం ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది
ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి
కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి