ఐపీఎల్ లో భారీ సమరం అంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనే చెబుతారు
ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది
ఐపీఎల్ 'ఎల్ క్లాసికో'గా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు వరుస విజయాలతో సత్తా చాటడం మొదలుపెట్టింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది
హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి
ఇక ధోని మరో 4 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. సీఎస్కే తరఫున కేవలం సురేశ్ రైనా (5529) మాత్రమే ఈ ఘనత సాధించాడు
సీఎస్కే తరఫున ధోని 249 మ్యాచ్‌ల్లో 4996 పరుగులు చేశాడు. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్ సీఎస్కే తరఫున ధోనికి 250వ మ్యాచ్ కావడం మరో విశేషం
సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ మరో 11 పరుగులు చేస్తే.. ముంబై, సీఎస్కే మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది
రైనా 30 మ్యాచ్‌ల్లో 710 పరుగులు చేశాడు. 27 మ్యాచ్‌ల్లో 700 పరుగులు చేసిన రోహిత్, మరో 11 పరుగులు చేస్తే రైనా రికార్డును బద్దలు కొడతాడు