ఊబకాయంతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. లావు తగ్గాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కానీ కుదరదు.

మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి
మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి
పొట్ట తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు వైద్య నిపుణులు
అన్నానికి బదులుగా కొర్రలు, ఓట్స్, జొన్నలు, రాగులు, కందులు, ఉలవలు మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలి
బీర, సొర, పొట్ల కాయ వంటి కాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇక పొట్ట తగ్గాలని భావించేవారు పగటిపూట నిద్రపోకపోవడమే బెటర్.
ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, బయట తినుబండారాలు, పిండివంటలు తినకుండా ఉండాలి
మితంగా భోజనం చేయడం, భోజనం చేసే అరగంట ముందు నీళ్లు బాగా తాగాలి. భోజనం పూర్తయిన రెండు గంటల తర్వాత మళ్ళీ నీటిని తాగాలి
గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి భోజనం 7 గంటల లోపే చేయడం బెటర్
బార్లీ గింజలను గంజి చేసుకొని తాగడం వల్ల అధిక బరువు గణనీయంగా తగ్గవచ్చు. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది