మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఫుడ్ ముఖ్యమని అంటూ ఉంటారు. అది నిజమేనని చాలాసార్లు రుజువు అయింది.
సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం మనిషికి ఎంతో అవసరం. పోషకాహారంపై అవగాహన కూడా ముఖ్యమే..! ప్రతి ఒక్కరూ వారి డైట్‌లో మంచి ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
కేవలం ఎగ్ వైట్ కు మాత్రమే పరిమితమవ్వకండి. గుడ్డు పచ్చసొనలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైన కోలిన్‌తో సహా అనేక పోషకాలు మెండుగా ఉంటాయి.
పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఫోలికామ్లం, ఐరన్, క్యాల్షియం, కాపర్, సల్ఫర్‌లు కూడా ఉంటాయి
టమాటాలను ఉడికిస్తే.. వాటిలోని లైకోపీన్ పరిమాణం పెరుగుతుంది. లైకోపీన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఇది క్యాన్సర్, గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది. ప్రస్తుతం కాస్త ధర ఎక్కువగా ఉందనుకోండి మార్కెట్ లో..!
అవకాడో మంచి ఫుడ్. అవకాడో గింజలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటుంది
బ్రకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు. పచ్చిగా తింటే విటమిన్ సి, ఫోలేట్, సల్పోరాఫేన్ వంటి మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి
చిక్కుడు జాతికి చెందిన పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బి-విటమిన్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో చక్కెర తక్కువగా, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి