ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలని అనుకుంటూ ఉన్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి!!

వేసవి కాలం కావడంతో కొంచెం చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పు. అలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఊటీ, కొడైకెనాల్ ఉన్నాయి
అయితే ఇటీవలి కాలంలో ఊటీ, కొడైకెనాల్ కు భారీగా జనం పోటెత్తుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాహనాలే.. ఉండడానికి హోటల్ గదులు కూడా దొరకడం లేదు
పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండడంతో స్థానికులు కూడా ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల తాకిడిని అడ్డుకోడానికి, నీలగిరి పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ఊటీ, కొడైకెనాల్ సందర్శకులు ఇ-పాస్ విధానాన్ని ఉపయోగించాలని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది
ఈ కొత్త నియమం, మే 7, 2024 నుండి జూన్ 30, 2024 వరకు అమలులో ఉంటుంది. సంవత్సరంలో అత్యంత రద్దీగా ఉండే సమయంలో పర్యాటకుల రాకను నియంత్రించడానికి ఈ-పాస్ విధానాన్ని తీసుకుని వచ్చారు
ఇద్దరు న్యాయమూర్తులు ఎన్ సతీష్ కుమార్, డి భరత చక్రవర్తిలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ ఈ-పాస్‌ను ప్రవేశపెట్టింది. హిల్ స్టేషన్లకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరగడం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడం దీని ఉద్దేశ్యం
ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అని కూడా పిలుస్తారు, ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉంది. ఇక్కడ తేయాకు తోటలు, సుందరమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. అక్టోబరు నుండి జూన్ వరకు ఊటీని సందర్శించడానికి ఉత్తమ సమయం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది
ఊటీ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది నీలగిరి పర్వత రైలు మార్గం. ఈ UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ సొరంగాలు, వంతెనలు, పచ్చని అడవుల గుండా మిమ్మల్ని తీసుకెళ్లే సుందరమైన రైలు ప్రయాణాన్ని అందిస్తుంది
కొడైకెనాల్ ను హిల్ స్టేషన్ల యువరాణి అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. కొడైకెనాల్ లో ఎన్నో నిర్మలమైన సరస్సులు, పొగమంచు పర్వతాలు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది
కొడైకెనాల్ సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మే. కొడైకెనాల్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కొడై సరస్సు