సంతానోత్పత్తికి సంబంధించి స్పెర్మ్ కౌంట్ చాలా ముఖ్యం
ఎంతో మంది పురుషులపై జరిపిన అధ్యయనం ప్రకారం ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచవచ్చు, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది
విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది
చేపలు తినడం.. మెరుగైన స్పెర్మ్ కౌంట్ కోసం చేపలు బాగా తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మీకు లభిస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాలకు ప్రత్యామ్నాయంగా చేపలు తినడం చాలా మంచిది
స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం అవసరం
బార్లీ, రెడ్ మీట్, బీన్స్ మొదలైనవాటిలో జింక్ అధికంగా ఉంటుంది. స్పెర్మ్ అభివృద్ధిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది
అరటిపండ్లలో విటమిన్ ఎ, బి1 , సి పుష్కలంగా ఉంటాయి, ఇది మీ శరీరం ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది
దానిమ్మ పండ్లను ఎక్కువగా తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అదనంగా, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది
గుడ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్లకు మంచి మూలం. ఇది స్పెర్మ్ ఉత్పత్తి మొత్తాన్ని పెంచుతుంది