ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ భారతదేశంలో ఈ మ్యాచ్ ల కవరేజీని ఉచితంగా అందిస్తోంది.

మొబైల్ ఫోన్స్ లో ఉచితంగా ప్రపంచ కప్ మ్యాచ్ లను చూడొచ్చు. ప్రపంచ కప్ కోసం కొత్త ఫీచర్లను తీసుకుని వచ్చింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డిస్నీ+ హాట్‌స్టార్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కలిసి కొత్తగా MaxView ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫంక్షనాలిటీ OTT ప్లాట్‌ఫారమ్‌లో క్రికెట్ అభిమానులను వర్టికల్ మోడ్‌లో చూడటానికి అనుమతిస్తుంది.
ఆండ్రాయిడ్, iOS యాప్‌లలో లైవ్ ఫీడ్ ట్యాబ్, స్కోర్‌కార్డ్ ట్యాబ్ లను చూడొచ్చు. యూజర్‌ తనకు నచ్చిన ప్లేయర్‌ను మ్యాక్స్‌వ్యూ మోడ్‌లో వీక్షించొచ్చు. స్ప్లిట్‌ వ్యూలోనూ చూడొచ్చు.
హైక్వాలిటీలో మ్యాచ్‌లు వీక్షించినప్పటికీ తక్కువ డేటా ఖర్చయ్యే విధంగా తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసినట్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ తెలిపింది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఇతర కంటెంట్ చూస్తున్నప్పటికీ.. మ్యాచ్‌ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు
ఫ్రీ కంటెంట్‌ను, పెయిడ్‌ కంటెంట్‌ను వేర్వేరుగా ఇకపై యాప్‌ చూపిస్తుంది. యాప్‌లో ఫ్రీ బ్యాడ్జ్‌ కలిగిన ఇతర కంటెంట్‌నూ యూజర్లు ఫ్రీ గా వీక్షించొచ్చు. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లు మొబైల్‌ యాప్‌లో మాత్రమే ఫ్రీగా లభిస్తాయి
కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌లలో వీక్షించాలంటే మాత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌ యాడ్స్‌తో కూడిన వార్షిక ప్లాన్‌ ధర రూ. 899 కాగా.. యాడ్‌ ఫ్రీ ప్లాన్‌ ధర రూ.1499గా లభిస్తోంది. మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ రూ.499కి లభిస్తోంది
ఇక ఐసీసీ వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీసు లభించలేదు. ఇంగ్లండ్ తో మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దు కాగా, నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కనీసం టాస్ పడింది