థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన దిశా పటానీ

బాలీవుడ్ నటి దిశా పటానీ ఎప్పుడూ తన స్నేహితురాళ్లతో సెలవులు గడపడానికి ఇష్టపడుతుంది. ఆమె తరచుగా కృష్ణ ష్రాఫ్, మౌని రాయ్, సోనమ్ బజ్వాతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంది
అయితే, ఈసారి దిశాతో పాటు ఆమె ఇతర స్నేహితులు ఉన్నారు. ఇటీవల తన థాయ్‌లాండ్ విహారయాత్రకు వెళ్ళింది
సముద్రం దగ్గర సేద తీరుతూ బీచ్‌వేర్‌లో వరుస చిత్రాలను దిశా పటానీ పంచుకున్నారు
తెలుగులో లోఫర్ సినిమాలో నటించిన దిశా పటానీ.. ఇప్పుడు కల్కి సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్ కీలక పాత్రలను పోషిస్తూ ఉన్నారు
బీచ్, పూల్‌సైడ్‌లో విశ్రాంతి తీసుకోవడాన్ని తాను ఇష్టపడతానని దిశా ఎప్పుడూ చెప్పుకొచ్చేది
ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన వర్కౌట్ వీడియోలను తరచుగా పోస్ట్ చేసింది. ఆమె బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్‌ల సమయంలో కూడా ఆమె తన వ్యాయామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయలేదు
దిశా ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా-రాశి ఖన్నాల యాక్షన్-థ్రిల్లర్ యోధాలో నెగిటివ్ క్యారెక్టర్‌లో నటించింది
సూర్య, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న 'కంగువ' సినిమాలో కూడా దిశా పటానీ భాగంగా ఉంది. కంగువ అనేది టైమ్ ట్రావెల్ ఆధారంగా రూపొందించబడిన సైన్స్ ఫిక్షన్ పీరియడ్ యాక్షన్-థ్రిల్లర్. ఇది దిశా తొలి తమిళ చిత్రం