డిసీజ్ ఎక్స్.. ప్రపంచాన్ని వణికించబోతోంది. మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి కోట్ల మంది ప్రాణాలు తీసే అవకాశం ఉందట
కరోనా మహమ్మారి నుండి బయటపడడానికే మానవాళికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు మరో వైరస్ ప్రజల మీదకు రాబోతోంది
కరోనా వైరస్ అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని.. ఆ తర్వాత మరిన్ని వైరస్‌లు మానవాళిని తీవ్రంగా భయపెట్టనున్నాయట!!
త్వరలోనే మరో కొత్త మహమ్మారి పుట్టుకురానుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. తాజాగా డైలీ మెయిల్‌లో అందుకు సంబంధించి ఓ కథనం ప్రచురితం అయింది
ఈ కొత్త వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని వైద్య రంగ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓ దీనికి ఓ కొత్త పేరు పెట్టింది. దానికి ‘డిసీజ్ X’ అని నామకరణం చేసింది.
ఈ డిసీజ్ X.. ఇప్పటికే తన ఉనికిని చాటుకుంటోందని.. ఈ డిసీజ్ X కొవిడ్ వైరస్ కంటే 7 రెట్లు అధికంగా ప్రాణాంతకమైందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బింగ్‌హామ్ హెచ్చరించారు
డిసీజ్ X తో పోల్చితే కొవిడ్ మరీ అంత ప్రాణాంతకం కాదని తెలిపారు. డిసీజ్ X కారణంగా 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు
జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్‌లు ఉన్నాయి
వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు