దీపావళి ముందుగా వచ్చే ధన త్రయోదశి రోజున బంగారం కొనుక్కునే ఆచారం చాలా మందికి ఉంది

దీపావళికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ పర్వదినం వస్తుంది. ఆరోజున చాలా మంది లక్ష్మీ దేవి ప్రతిమను, రూపును, బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు
ధన త్రయోదశి రోజున సంపాదన ప్రసాదించమని లక్ష్మీ దేవికి , కుబేరుడికి పూజలు చేస్తారు. బంగారమే కాకుండా వెండి, ఇత్తడి, రాగి, కంచు లాంటి లోహపు వస్తువుల్నీ కొనుగోలు చేస్తున్నారు
ధన త్రయోదశి రోజు చీపురుని కొనడం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద వస్తుంది. లక్ష్మీదేవి నివసించే చీపుర్లను ధన త్రయోదశి రోజు మంచి ముహూర్తాన ఆలయానికి దానంగా ఇవ్వాలి
ధన త్రయోదశి రోజున చీపురును పగటిపూట కొనకూడదు. సాయంత్రం మాత్రమే కొనాలి. ధన త్రయోదశి రోజున ప్రదోషకాలంలో చీపురును కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు
కొన్ని వస్తువులను ధన త్రయోదశి రోజున అసలు కొనకూడదని పండితులు చెబుతుంటారు. ఆయా వస్తువులను కొంటే దరిద్రం మీ వెంట వస్తుందని అంటున్నారు
ధన త్రయోదశి రోజు నూనె, నెయ్యి కొనకండి. ఒకవేళ అవసరం అనుకుంటే ముందు రోజో, ఆ తర్వాత రోజో తెచ్చుకునే ప్రయత్నం చేయండి
ఇనుప వస్తువులు, ఇనుముతో చేసిన వంట సామాన్లను ధన త్రయోదశి రోజున అస్సలు కొనకండి. ఇనుమును ఇంటికి తెచ్చుకోవడం వల్ల కుబేరుడి ఆశీస్సులు దొరకవని ఓ నమ్మకం. స్టీల్‌ వస్తువులు కొనకపోవడమే మంచిదని చెబుతున్నారు
చాకులు, కత్తుల్లాంటి పదునైన వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోకండి. ఇవి మనకు అదృష్టాన్ని దూరం చేస్తాయి. గాజు రాహు సంబంధమైన లోహం కావడంతో గాజు వస్తువుల్ని మాత్రం ఈ సమయంలో అస్సలు కొనకండి
బంగారానికి బదులుగా గిల్టు నగల్ని కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవాలని అనుకోకండి