IMDb Most Viewed Indian Stars: గ్లోబల్ క్వీన్ దీపికా అని తేల్చేసిన ఐఎండీబీ

IMDb లో గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించిన టాప్ 100 భారతీయ తారలకు సంబంధించిన జాబితాలో దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచింది
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, అలియా భట్‌లను వెనక్కి నెట్టి మరీ దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచింది
షారూఖ్ ఖాన్ సరసన 'ఓం శాంతి ఓం' అనే బ్లాక్ బస్టర్ చిత్రం ద్వారా దీపికా పదుకొనే బాలీవుడ్ లో అడుగుపెట్టింది
ఆమె తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. విభిన్న తరహా సినిమాలలో నటిస్తూ.. తన స్టార్డమ్ ను అంతకంతకూ పెంచుకుని వెళ్ళిపోయింది
చెన్నై ఎక్స్‌ప్రెస్, పీకూ సినిమాలలో దీపికా యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
ఇక బాజీరావ్ మస్తానీ, పద్మావత్‌ సినిమాలలో దీపికను చూస్తూ ఉండిపోయారు. చారిత్రాత్మక పాత్రలలో ఆమె అద్భుతంగా నటించింది
ఆమె 2017లో హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 'xXx: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్‌' తో ఆమె అంతర్జాతీయంగా కూడా పేరును తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె విన్ డీజిల్ సరసన నటించింది
ఈ ఘనత దక్కడం పట్ల దీపికా పదుకోన్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచ ప్రేక్షకుల మనోభావాలను సంగ్రహించే జాబితాలో తాను భాగమైనందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ దీపికా పదుకోన్ పోస్ట్ పెట్టింది
IMDb అనేది ప్రజల అభిరుచి, ఆసక్తులు, ప్రాధాన్యతలకు సంబంధించి నిజమైన పల్స్‌ని ప్రతిబింబిస్తుంది. ఈ గుర్తింపు నిజంగా చాలా ప్రత్యేకమైనది. నేను ప్రేక్షకుల నుండి ప్రేమను పొందడం కోసం మరిన్ని పాత్రలతో మీ ముందుకు వస్తానని దీపిక తెలిపింది