భర్త చేతులు పట్టుకుని ఓటు వేయడానికి వచ్చిన దీపిక పదుకోన్

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి భర్త రణవీర్ సింగ్ చేయి పట్టుకుని, నటి దీపికా పదుకోన్ ముంబైలోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు
తెల్లటి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి, తన బేబీ బంప్‌ తో ఓటు వేయడానికి వచ్చింది
ఈ జంటను ఫోటోలు తీయడానికి జనం ఎగబడ్డారు. దీపిక, రణ్‌వీర్‌లు సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు
దీపిక ఇటీవలే తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీపికాతో పాటు రణ్‌వీర్ సింగ్ కూడా పక్కనే ఉన్నాడు. వారు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించినప్పుడు ఆమె చేతిని పట్టుకున్నాడు
ఫిబ్రవరి 29న దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌ తమ కుటుంబంలో జరగబోయే గుడ్ న్యూస్ గురించి ప్రకటన చేశారు. తాను తల్లి కాబోతున్నా అనే విషయాన్ని దీపిక అధికారికంగా ప్రకటించింది
దీపికా 'సింగం' సిరీస్ లో నటిస్తూ ఉంది. తెలుగులో ప్రభాస్ సరసన 'కల్కి 2898 AD'లో కనిపించనుంది. రణవీర్ సింగ్ ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు