చలికాలంలో ఖర్జూరం చేసే మేలు ఎంతో!!

ఖర్జూరాల వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఖర్జూరాలను తీసుకోవడం కూడా మంచిదే
పోషకాలతో నిండిన ఖర్జూరంలో ముఖ్యమైన విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం ఉన్నాయి
ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఫైబర్ ఎంతగానో సహాయం చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదు. పాలీఫెనాల్స్ యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి
ఖర్జూరంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ఖర్జూరాల్లో ఐసోఫ్లేవోన్‌లు ఉంటాయి, ఇవి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి
జలుబుతో పోరాడటానికి ఖర్జూరాలను తీసుకోవడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి
ఉడికించిన నీరు, 2-3 ఖర్జూరాలు, చిటికెడు ఎండుమిర్చి, యాలకుల పొడి కలిపి మరిగించాలి. నిద్రపోడానికి ముందు తాగితే.. మరుసటి రోజు ఉదయం మంచి ఫలితం దక్కుతుంది
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా చలికాలంలో సాధారణ జలుబు, ఫ్లూ వైరస్‌ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి
మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మీ శరీరం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది