నేడే ఐపీఎల్-2024 ఆరంభం.. మ్యాచ్ ను వీక్షించాలంటే?

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ IPL- 2024 మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది
చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు
ప్రారంభ వేడుకల తర్వాత మ్యాచ్ మొదలుకానుంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 7:30 సమయానికి మ్యాచ్ మొదలు కావాల్సి ఉండగా.. అందుకు బదులుగా 8:00 PM ISTకి ప్రారంభమవుతుంది
టాస్ 7:30 PM IST కి జరుగుతుంది. IPL 2023 తర్వాత మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని తిరిగి మ్యాచ్ ఆడబోతూ ఉన్నాడు
CSK కు చెందిన శివమ్ దూబే.. గాయం కారణంగా రంజీ ట్రోఫీ నాకౌట్‌లను కోల్పోయిన తర్వాత మళ్లీ ఫిట్‌గా మారాడు
స్పోర్ట్స్18 హెచ్‌డీ, జియో సినిమా వెబ్‌సైట్‌, యాప్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు
రెండు నెలల విరామం తర్వాత కోహ్లి తిరిగి మ్యాచ్ ఆడబోతూ ఉన్నాడు. IPL 2023 నుండి, కోహ్లి కేవలం రెండు T20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024 T20 ప్రపంచ కప్‌కు అతని ఎంపికకు సంబంధించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి
భారతదేశంలో, CSK vs RCB IPL 2024 మొదటి మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు
మొబైల్, ల్యాప్ టాప్, టీవీలలో ప్రత్యక్ష ప్రసారం JioCinemaలో అందుబాటులో ఉంటుంది