డయాబెటిస్ ఉన్న వాళ్లు ఏది తినాలి.. ఏది తినకూడదు అనే టెన్షన్ తో బతుకుతూ ఉంటారు
షుగర్ పేషంట్లు పాలకూర తీసుకోవాలి.. ఈ ఆకుకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి
బచ్చలికూరలో థైలాకోయిడ్స్ అనే పొర ఉందని, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది
పాలకూర రసం తాగడం కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బచ్చలికూర తినడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది
షుగర్ రోగులు దోసకాయ తింటే చాలా బెటర్ అట.. దోసకాయ తినడం వల్ల మధుమేహం కాకుండా శరీరంలోని వాపుల నుండి ఉపశమనం లభిస్తుంది
క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాబేజీలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాబేజీని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులకు టొమాటో మంచి చేస్తుంది. టొమాటోలో లైకోపీన్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది
టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తికి మంచిదని భావిస్తారు
టమోటాలు తినడం గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. టొమాటోలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు
మధుమేహ వ్యాధిగ్రస్తులు బెండకాయ తినవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో బెండకాయ వినియోగం సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో వెల్లడైంది.