ఎంతో మందికి చాకొలేట్ తినడం అలవాటు.. చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ చాకొలేట్ తినడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి
అయితే ఎక్కువగా చాకొలేట్ తింటే కూడా మంచిది కాదు. ఎన్నో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి
పూర్తిగా చాకొలేట్ ను మానేయడం కష్టమే అయినా.. ఓ నెలరోజుల పాటూ చాకొలేట్ ను తినడం మానేయండి. అప్పుడు మీ శరీరంలో జరిగే మార్పులను మీరే గమనిస్తారు
చాకొలేట్ ను తక్కువగా తీసుకుంటే కేలరీ ఇన్ టేక్ కూడా తగ్గుతుంది. అలాగే చక్కెర మీ శరీరంలోకి తక్కువగా వెళుతుంది. కావిటీస్, దంత క్షయం ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా దంత ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని వైద్యులు తెలిపారు
చాకొలేట్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. తక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్లు చాకొలేట్ కు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది
రెగ్యులర్ గా చాకొలేట్ ను తీసుకునే వ్యక్తులు ఒక్కసారిగా చాకొలేట్ ను మానేయడం ద్వారా కొంత చిరాకు పడుతూ ఉండొచ్చు. అయితే, ఈ లక్షణాలు సాధారణంగా కాలక్రమేణా తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మూడ్ స్వింగ్‌లు, తలనొప్పిని కూడా అనుభవించవచ్చు
ఇక తప్పకుండా తినాలని అనుకుంటే మాత్రం.. తక్కువ చక్కెర, ఎక్కువ యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉండే అధిక కోకో కంటెంట్ (70% లేదా అంతకంటే ఎక్కువ) ఉన్న డార్క్ చాక్లెట్ వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించండి
తియ్యగా ఉండే పదార్థాలే తినాలని మీకు అనిపిస్తే మాత్రం.. మామిడిపండ్లు, పైనాపిల్స్, బెర్రీస్, పీచెస్ వంటి సహజంగా తియ్యగా ఉండే పండ్లను కూడా ఎంచుకోవచ్చు. ఖర్జూరం కూడా మంచిదే!