కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు

వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు
కొన్ని మెడిసిన్ ధరలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్, తోలు, వస్త్ర పరిశ్రమ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది
క్యాన్సర్, డయాబెటిస్ సహా 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి
విదేశీ విద్య, వైద్య పరికరాలు, టూర్ ప్యాకేజీలపై పన్ను తగ్గింపు నేపథ్యంలో ఖర్చు తగ్గనుంది
మైక్రోవోవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు
ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది
ఆల్కాహాల్, సిగరెట్, పాన్ మసాలా వంటి హానికర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి
లగ్జరీ వాచ్ లు, విదేశీ మద్యం ధరలు పెరగనున్నాయి